పుష్ప సినిమాలో మరో  హీరో ? టాలీవుడ్ టాక్

0
95

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో  పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఆర్య ఆర్య 2 తర్వాత వస్తున్న సినిమా ఇది. దీనిపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా దీంతో ప్రెస్టేజ్ గా తీసుకున్నారు క్రియేటీవ్ దర్శకుడు సుకుమార్. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ టాక్.  అంతేకాదు ఇందులో ఫాహద్ ఫాజిల్  నటిస్తున్నారు. అయితే కరోనా వల్ల షూటింగుకి బ్రేకులు వచ్చాయి.

 

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ షూటింగ్ ఉండే అవకాశం ఉంది. బన్నీఫాహద్ ఫాసిల్ కాంబినేషన్ లో వచ్చే మూడు సీన్స్ షూటింగ్ ఇంకా ఉందని తెలుస్తోంది. టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ సినిమాలో తరుణ్ ఓ నటుడికి వాయిస్ అరువు ఇవ్వనున్నారు అంటున్నారు.

 

ఆహా ఓటీటీలో విడుదలైన అనుకోని అతిథి సినిమాలో నటుడు ఫాహద్ ఫాసిల్కి తరుణ్ డబ్బింగ్ చెప్పారు.  ఆయనకు వాయిస్ బాగా సెట్ అయింది. అందుకే  ఈ సినిమాలో కూడా  ఫాసిల్ కు తరుణ్ చేత వాయిస్ చెప్పిస్తే బాగుంటుంది అని ప్లాన్ వేస్తున్నారట. మరి చూడాలి ఇది ఎంత వరకూ వాస్తవమో టాలీవుడ్ లో ఈ వార్తలు అయితే వినిపిస్తున్నాయి.