మరో హీరోయిన్ రీ ఎంట్రీ.. ఎవరో తెలుసా..!!

మరో హీరోయిన్ రీ ఎంట్రీ.. ఎవరో తెలుసా..!!

0
104

అలనాటి హీరోయిన్స్ ఇప్పుడు సినిమా తెరమీదకి వచ్చి మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇప్పటికే ఈ లిస్ట్ లో విజయశాంతి, లైలా చేరిపోయారు. ఇక ఇప్పుడు సంఘవి కూడా రీఎంట్రీకి సిద్ధమవుతోంది. దక్షిణాదిన చెప్పుకోదగిన సినిమాలు చేసిన సంఘవి పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఇప్పుడు తెలుగు తెరకు కనిపించడం..

ఇన్ని సంవత్సరాలకు తనకు నటించాలనే కోరిక కలిగిందట! ముఖ్యంగా తెలుగులో ఓ మంచి కథతో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోందట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కాకపోతే ఎలాంటి సినిమా కోసం ఎదురుచూస్తోందో మాత్రం చెప్పలేదు. మరి సంఘవి ఎలాంటి పాత్రల్లో కన్పిస్తుందో చూడాలి.