సల్మాన్‌ ఖాన్‌ను సఫా చేయడానికి ప్లాన్.. మరొకరు అరెస్ట్..

-

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను హత్య చేయడం కోసం కుట్ర జరిగిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కుట్రకు సంబంధించి హర్యాణాలో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేవారు. అతడిని ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. 14 ఏప్రిల్ 2024న సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగాయి. బక్‌పై సల్మాన్ ఇంటి దగ్గరకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. జూన్‌లో ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా సల్మాన్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులకు తెలిసింది. పన్వేల్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న సమయంలో సల్మాన్‌పై దాడి చేయాలని పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు ఆ వ్యక్తి ద్వారా పోలీసులకు తెలిసింది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా హర్యాణాలో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో రెండు మూడు రోజుల్లో అతడిని ముంబై జైలుకు తరలించే అవకాశం ఉంది.

- Advertisement -

పంజాబ్ సింగర్ సిద్దు మూసేవాలే తరహాలోనే సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను కూడా హతమార్చాలని ఒక గ్యాంగ్ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు నేవీ ముంబై పోలీసులు తమ 350 పేజీల ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. ఇందుకోసం కొందరు మైనర్లను సెలక్ట్ చేసుకుని వారిని షార్ట్ షూటర్ల తరహాలో వాడాలని ఆ గ్యాంగ్ సిద్ధమైంది. సినిమా షూటింగ్స్ లేదా ఫామ్‌హౌస్‌కు వెళ్లే సమయంలో ప్లాన్ ప్రకారం దాడి చేయాలని గ్యాంగ్ అనుకుంది. ఇందుకోసం వాళ్లు రూ.25 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read Also: మొదలు కానున్న ‘ఓజీ’
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...