ఈ మధ్య కాలంలో బయోపిక్స్ చాలా రిలీజ్ అయ్యాయి, అంతేకాదు ఆ సినిమాలు చాలా మందిని ఆకట్టుకున్నాయి, అలనాటి నటులు హీరోలు హీరోయిన్లు రాజకీయ నేతల గురించి ఇప్పటి తరం వారికి తెలియని అనేక విషయాలు ఈ బయోపిక్స్ ద్వారా తెలిశాయి, వారు ఎన్నికష్టాలు పడి చిత్ర సీమలో ఇలా ఎదిగారు అనేది కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు.. ఇక
గతంలో వచ్చిన డర్టీ పిక్చర్.. ఇటీవల వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి, అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు కూడా సూపర్ హిట్ అయింది.
ఇక తాజాగా సౌందర్య బయోపిక్ కూడా రానుంది అని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి, ఇలాంటి వేళ మరో సీనియర్
ప్రముఖ నటి జమున బయోపిక్ ను నిర్మించడానికి ఇప్పుడు ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.. దర్శకుడు శివనాగు నర్రా దీనికి దర్శకత్వం వహించనున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఈ స్టోరీ రాస్తున్నారట, అంతేకాదు జమునతో ఆనాటి నుంచి సాన్నిహిత్యంగా ఉన్న సినిమా వారు నటులు ఫ్రెండ్స్ బంధువులు ఇలా అందరిని మీట్ అవుతున్నారట, అనేక విషయాలు తెలుసుకుంటున్నారట.. మరి జమున పాత్రలో నటింపజేయడానికి ఎవరిని చూస్తున్నారు అంటే తమన్నా పేరు వినిపిస్తోంది.. చూడాలి మరి దీనిపై ఎప్పుడు ప్రకటన వస్తుందా అని చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.
|
|
టాలీవుడ్ లో మరో ప్రముఖ నటి బయోపిక్ – ఎవరు నటిస్తున్నారంటే
-