తమిళనాడు రాజకీయాల్లోకి మరో సంచలనం అనే చెప్పాలి.. ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రజనీకాంత్ పార్టీ ప్రకటన ఈ నెల చివరిన తెలియచేయనున్నారు.. సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పుడు పార్టీ గుర్తు, జెండాపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అభిమానులు సన్నిహితుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
అర్జున్ మూర్తి, తమిళ రవి మణియన్ లు సహా, మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శలతో భేటీ అయి వీటిపై చర్చిస్తున్నారు, తమ పార్టీ గుర్తు అందరికి అర్ధం అయ్యేలా దగ్గర చేసేలా ఉండాలి అని చూస్తున్నారు రజనీకాంత్..పార్టీ చిహ్నంగా
అన్నామలైచిత్రంలో అభిమానులను ఎంతో అలరించిన సైకిల్, పాలక్యాన్, రజనీ గెటప్ ను చిహ్నంగా ఎంచుకోవాలని సలహా ఇచ్చారట.
రజనీకి కూడా ఇది బాగానే నచ్చింది ఈగుర్తుపై ఏమైనా అభ్యంతరాలు వస్తాయా ఇలా అనేక విషయాలు లీగల్ టీమ్ లో మాట్లాడి వెల్లడిస్తారు.ఈ నెల 31న రజనీ నుంచి రాజకీయ ప్రకటన రావడం పక్కా, పార్టీ పేరు గుర్తు కూడా ఆరోజే విడుదల చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది.