Flash: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..సూసైడ్ నోట్‌ రాసి ప్రముఖ నటి ఆత్మహత్య

0
78

చిత్రపరిశ్రమలో వరుస విషాదాలతో కనీసం కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా, వ్యక్తిగత కారణాల చేత మరణించగా..తాజాగా ప్రముఖ బెంగాలీ నటి బిదిషా డి మంజుదార్ ఈ నెల 25వ తేదీన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో చిత్ర సీమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా..తన చావుకు గల కారణాలు తెలుపుతూ ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాలోని తన అపార్ట్‌ మెంట్‌లో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న బిదిషా డి మంజుదార్ వివరాలను స్థానికులను విచారిస్తూ వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి..ప్రస్తుతం ఈ కేసుపై విచారణ ప్రారంభించారు.