టాలీవుడ్ లో మరో విషాదం..ఆ నిర్మాత మృతి

0
83

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ‘హార్మోన్స్‌’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు సినీ నిర్మాత ఎన్‌.ఎస్‌.నాయక్‌ (55) మృతి చెందారు. గుండెపోటుతో  ఆయన మరణించారు. ఈ విషయాన్ని ‘హార్మోన్స్‌’ చిత్ర దర్శకుడు ఆనంద్‌కుమార్‌ తెలియజేశారు. నాయక్‌ సినిమాలతో పాటు ‘ప్రజా హక్కు’, ‘అంటరానితనం’, ‘చిరు తేజ్‌’ లాంటి లఘు చిత్రాలను నిర్మించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా కొద్దిరోజుల క్రితమే నటుడు రాజబాబు మృతి చెందిన విషయం తెలిసిందే.