ప్రభాస్ ‘రాధేశ్యామ్’​ నుండి మరో అప్డేట్..సంచారి సాంగ్ టీజర్ రిలీజ్ (వీడియో)

0
96

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్​ వచ్చేసింది. ‘సంచారి’ అంటూ సాగే పాట టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విజువల్స్​ చాలా రిచ్​గా ఉన్నాయి. పూర్తి పాటను 16వ తేదీన రిలీజ్​ చేయనున్నారు.

కాగా, 1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో ‘రాధేశ్యామ్’ను తెరకెక్కించారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా చేసింది. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు.

యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రభాస్​ ఇప్పటికే బీటౌన్​ దర్శకుడు ఓం రౌత్​తో ‘ఆదిపురుష్’ చేస్తున్నారు. దీంతో పాటే ‘సలార్’​, ‘ప్రాజెక్ట్​ కె’, ‘స్పిరిట్’​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

సంచారి సాంగ్ టీజర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

 

https://www.youtube.com/watch?v=mIcCOcma07Q&feature=emb_title