RRR నుండి మరో వీడియో రిలీజ్..ఫ్యాన్స్ ను టెంప్ట్ చేస్తున్న రాజమౌళి

Another video release from RRR..Rajamouli tempting fans

0
98
RRR Wins Best Original Song

ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్​ఆర్​ఆర్’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్​, ‘దోస్తీ’, ‘నాటు నాటు’, ‘జనని’ పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో ఎన్టీఆర్ పోషించిన కొమురం​ భీమ్​ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. అల్లూరిసీతరామరాజుగా నటించిన రామ్​చరణ్​కు సంబంధించిన​ కొత్త పోస్టర్​ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది.

రామ్ చరణ్ కు సంబంధించి బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్ అంటూ 16 సెకెన్ల వీడియోను వదిలిపెట్టింది. అలాగే ఈ వీడియోలో డిసెంబరు 9న ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు మరోసారి గుర్తు చేసింది.

https://www.youtube.com/watch?v=61OCzo7vL1o