నిహారిక-చైతన్యల వివాహం ఉదయ్ పూర్ లోని ఈ డిసెంబర్ 9 న గ్రాండ్ గా జరిగింది, ఇక మెగా హీరోలు అందరూ కూడా ఈ వివాహానికి హాజరు అయ్యారు.. అయితే తాజాగా టాలీవుడ్ లో మరో వార్త వినిపిస్తోంది, మెగా కాంపౌడ్ నుంచి మరో పెళ్లి జరగనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ విషయం బయటపెట్టారు. వచ్చే ఏడాదిలో తమ కుటుంబంలో మరో పెళ్లి జరగవచ్చని ఆయన అన్నారు. అయితే మరి ఆయనదే వివాహం అని మీరు అనుకుంటున్నారా, కాదు ఆ విషయం కూడా చెప్పాడు, వచ్చే ఏడాది బహుశా అల్లు అరవింద్ గారి కుమారుడు శిరీష్ వివాహం జరగవచ్చు అని అన్నాడు.
ఇక అల్లు శిరీష్ నా కంటె పెద్దవాడు, తనకి వచ్చే ఏడాది వివాహం చేయవచ్చు అని తెలిపాడు సాయి ధరమ్ తేజ్…ఇంటి పెద్దకొడుకుగా నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి పూర్తి చేశాక చూస్తాను అన్నారు, ఇక ఇప్పటికే సాయిధరమ్ తేజ్ కు వివాహం అని అనేక వార్తలు వినిపించాయి.. కాని దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వేలేదు, సో శిరీష్ వివాహం తర్వాత సాయి ధరమ్ తేజ్ వివాహం ఉండవచ్చు అంటున్నారు అందరూ.