జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మరో యంగ్ హీరో ? టాలీవుడ్ టాక్

Another Young hero in the Junior NTR movie

0
107

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇక ఈ సినిమా కథపై బిజిగా ఉన్నారు కొరటాల. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి అయ్యాక ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతుంది.

ఇందులో ఎన్టీఆర్ తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించాల్సి ఉందట. కీలక పాత్ర కోసం టాలీవుడ్ లేదా కోలీవుడ్ యంగ్ హీరోను ఎంపిక చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి చాలా మంది ఒకే చెబుతారు. గతంలో జనతా గ్యారేజ్ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరోను కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో హీరో ఎవరు అనేది మాత్రం చూడాలి. బీ టౌన్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.