అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయిఆ చిత్రాలు, అయితే గ్లామరస్ హీరోయిన్ గా ఆమెకు అభిమానులు అలాగే ఉన్నారు, అందం అభినయం ఉన్న నటి, అయితే ఆమెకి ఈ మధ్య తెలుగులో మళ్లీ పెద్ద సినిమాలు లేవు.
తాజాగా ఆమెకి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది తెలుగులో..యువ కథానాయకుడు నిఖిల్ సరసన ఆమె నటించనుందట.ప్రస్తుతం నిఖిల్ కథానాయకుడుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. 18 పేజెస్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు.
ఇక ఈ సినిమాకి నిర్మాత బన్నీ వాసు, అయితే లాక్ డౌన్ సమయంలో షూటింగ్ జరగడం లేదు, లాక్ డౌన్ తర్వాత ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది, ఆమె తో ఈ చిత్రానికి సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నారట.