కృష్ణవంశీ దర్శకత్వంలో అందాల భామ అనుష్క!!

కృష్ణవంశీ దర్శకత్వంలో అందాల భామ అనుష్క!!

0
113

కృష్ణవంశీ తన రేంజ్ కి తగిన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి చాలాకాలమే అయింది. ‘నక్షత్రం’ పరాజయం పాలైన తరువాత ఆయన నుంచి ఇంతవరకూ మరో సినిమా రాలేదు. ఈ లోగా ‘ఇదిగో .. అదిగో’ అన్నారుగానీ ఆ ప్రాజెక్టులేవీ పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ రెండుమూడు నెలల్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

గతంలో ఆయన పకడ్బందీగా తయారుచేసుకున్న ‘రుద్రాక్ష’ అనే స్క్రిప్ట్ నే ఆయన తెరపైకి తీసుకురానున్నాడు. నిర్మాతగా బండ్ల గణేశ్ ముందుకు రావడంతో, ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం మంచి క్రేజ్ వున్న కథానాయికల నుంచి ఒకరిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఆ వెంటనే అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా సమాచారం. ఈ తరహా కథకి అనుష్క అయితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.