హీరోయిన్ అనుష్క గురించి ఆమె పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి, ఆమె ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంటుంది అన్నారు, చివరకు ఓ దర్శకుడు అన్నారు, ఇటీవల క్రికెటర్ తో వివాహం అన్నారు కాని ఆమె వీరెవరితో పెళ్లి లేదు అని ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది.
అయితే ఈ వదంతులకి నేరుగా అనుష్క ఫుల్ స్టాప్ పెట్టారు, తాజాగా అనుష్క ఓ విషయం చెప్పింది అదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన ప్రేమ, పెళ్లి గురించి కొందరు ఎన్నో ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారని అనుష్క తెలిపింది… 2008లో తానూ ప్రేమలో పడినట్లు, అదో తీయని ప్రేమ అని చెప్పింది.
అయితే, కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయామని తెలిపింది. తాను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని తాను చెప్పబోనని పేర్కొంది.ఇక కేవలం ప్రభాస్ విషయంలో కూడా చాలా వార్తలు వినిపించాయి.. అయితే అతను నాకు మంచి మిత్రుడు అని సినిమా పరిశ్రమలో నాకు అత్యంత సన్నిహితుడు అని ఆమె చెప్పింది.