రాసే మందు చేతులు.. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి : అనుష్క ఫ్యాన్స్ ఫైర్

రాసే మందు చేతులు.. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి : అనుష్క ఫ్యాన్స్ ఫైర్

0
95

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. కొంత గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా నిశ్శబ్దం. మాధవ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, శాలిని పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన స్వీటీ. విమానాశ్రయం లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుష్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అనుష్క లుక్ పై మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఓ తెలుగు మూవీ వెబ్ సైట్ రాసిన రచనల పై స్వీటీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఈ వెబ్సైట్ ఏర్పోర్ట్లో అనుస్కని చూసిన అభిమానులు షాక్కు గురవుతున్నారు. కొంతకాలంగా అనుష్క అధిక బరువు సమస్యతో బాధపడుతోంది. తనని చూస్తుంటే బరువుగా. ఉబ్బిన చెంపలతో కనిపిస్తుందని రాశారు దీనిపై స్పందించిన అనుష్క అభిమానులు ఒక అమ్మాయిని ఇంత అసభ్యకరంగా మాట్లాడతారా..? ఒక జాతీయ స్థాయి నటిని కించపరచడం సరి కాదని మీరు ఆమె కాలికి కూడా సరిపోరని సంబంధిత వెబ్ సైట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు రాసే ముందు చేతులు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టు కోవలని ఘాటు విమర్శలు చేస్తున్నారు.

ఏదైనా వార్త రాసే ముందు జర్నలిజం విలువలను గుర్తుపెట్టుకోండి, తన శరీరాకృతి పై సిగ్గు పడాల్సిన అవసరం తనకు లేదు. కానీ ఇతరుల గురించి అలా మాట్లాడటం గురించి మీకు సిగ్గు ఉండాలి. అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా అక్టోబర్ 2న విడుదల కానున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించనున్నారు.