అనుష్క కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

అనుష్క కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

0
99

స్వీటీ అనుష్క సినిమాలు కాస్త నెమ్మదించాయి అనే చెప్పాలి.. అయితే ఆమె పెళ్లి చేసుకుని బిజీ అవుతారు అని వార్తలు వస్తున్నాయి. కాని ఇటీవల ఆమె రెండు సినిమాలు ఒప్పుకోవడంతో ప్రస్తుతం ఆమె పెళ్లి విషయం పక్కన పెట్టింది అంటున్నారు.. తాజాగా ఆమె చేసిన సినిమా
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్ద.

థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది. దాదాపుగా విదేశాల్లో చిత్రీకరించబడిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. ముందుగా ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 24 న లేదా 29న విడుదల అవుతుంది అని అనుకున్నారు కాని ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చారు.

జనవరి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. అనుష్క భర్త పాత్రలో మాధవన్ నటించగా, అంజలి .. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక చాలా నెలల తర్వాత భాగమతి సినిమా హిట్ తరువాత అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇదే.దీంతో సహజంగానే చిత్రంపై అంచనాలు వున్నాయి. ఇక టాలీవుడ్ లో అనుష్క ఫ్యాన్స్ సినీ ప్రముఖులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.