విరాట్ ని క‌లిసిన మొద‌టిరోజే పంచ్ వేసిన అనుష్క శ‌ర్మ – ఏమైందంటే

Anushka Sharma punches to Virat on the first day

0
108

క్రికెట‌ర్ల‌కు సినిమా న‌టుల‌కి ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. కోట్లాది మంది అభిమానులు ఉంటారు.
క్రికెటర్లు సినిమాతారలు ప్రేమలోపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ అనుష్కశర్మ ఇద్ద‌రూ ఇలా ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ జంట 2017లో ఒక‌ట‌య్యారు.ఈ జంట పండండి పాపకు జన్మనిచ్చారు. విరుష్క జంట వారి పాప‌కు వామిక అనే అందమైన పేరు పెట్టారు.

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న భారత టెస్ట్ సిరీస్‌కు ముందు క్రికెటర్ దినేష్ కార్తీక్‌తో విరాట్ కొన్ని విష‌యాలు మాట్లాడారు. ఈ స‌మ‌యంలో ఎమోష‌న‌ల్ అయ్యారు. తన కూతురిని చూడటాన్ని తన తండ్రి లేరని విరాట్ ఎమోషనల్ అయ్యారు. విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006లో గుండెపోటుతో మరణించారు. త‌న త‌ల్లి వామిక‌తో చాలా సంతోషంగా ఉంటుంద‌ని చెప్పారు.

ఇక ఈ జంట అస‌లు మొద‌టి సారి ఎక్క‌డ క‌లుసుకున్నారు అప్పుడు విరాట్ ఫిలింగ్ ఏమిటి అనేది కూడా చెప్పాడు. తాను అంద‌రితో స‌ర‌దాగా మాట్లాడుతా అలాగే అనుష్క శ‌ర్మ‌తో కూడా మాట్లాడా, కాని ఆమె సీరియ‌స్ అయింది అని చెప్పాడు. మొద‌టిసారి 2013లో ఓ షాంఫూ ప్రకటన కోసం క‌లిశాం.
అనుష్క శర్మని మొదటిసారి చూసినప్పుడు ఆమె ధరించిన హై హీల్స్‌ని ఉద్దేశిస్తూ ఇంతకంటే ఎత్తు చెప్పులు దొరకలేదా అని స‌ర‌దాగా జోక్ చేశా, వెంట‌నే ఆమె సీరియ‌స్ అయింది నేను ఏమీ ఆరు అడుగులు లేను అందుకే హై హీల్స్‌ వేసుకున్నా అని పంచ్ వేసింద‌ట‌.