అనుష్మ శర్మ బాడీగార్డ్ శాలరీ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

ఈ వార్త అయితే తెగ వైరల్ అవుతోంది

0
88

సెలబ్రిటీలు కచ్చితంగా బయటకు వచ్చిన సమయంలో బాడీగార్డ్స్ లేకుండా బయటకు రారు. ఎందుకంటే బయట తిరగడం కష్టం, వారి చుట్టు చాలా మంది చేరతారు. మితి మీరిన అభిమానంతో కొంతమంది చేసే పనుల వల్ల అసౌకర్యంగా కొందరు ఫీల్ అయిన ఘటనలు మనం చూశాం. ఇక బాలీవుడ్ లో అయితే వేలాది మంది అభిమానులు వస్తూ ఉంటారు. అందుకే సెలబ్రెటీలు ఎక్కడకు వెళ్లినా తమ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉంటారు.

కొంతమంది వారికి భారీగా జీతాలు ఇస్తారట. ముఖ్యంగా సినిమా నటులు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలకు చెందిన బాడిగార్డ్స్ కి లక్షల్లో జీతం ఉంటుంది. తాజాగా విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల బాడీగార్డు గురించి ఓ వార్త వినిపిస్తోంది. ఇతనికి ఇచ్చే శాలరీని చూసి జనాలు షాకవతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ ఓ బాడీ గార్డ్ ప్రకాశ్ సింగ్ అకా సోనూను హైర్ చేసుకుంది.

ఈ జంటకి ఇప్పుడు అతను బాడీ గార్డ్ గా ఉన్నాడు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయనకు జీతం ఏడాదికి రూ.1.02 కోట్లు ఇస్తున్నారట. అంటే నెలకు దాదాపు 8.5 లక్షలు అంటున్నారు. మొత్తానికి ఈ వార్త అయితే తెగ వైరల్ అవుతోంది ఇందులో ఎంత వరకూ వాస్తవం ఉందో మరి.