ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిధిగా ఏపీ సీఎం..

0
115

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న ట్రైలర్ థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆనందపరిచింది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫంక్షన్‌ ఈ నెల 23 వ తేదీన విజయవాడలో సిద్దార్థ కాలేజీలో జరుగనుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగనున్నట్టు సమాచారం.

దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దీనివల్ల టాలీవుడ్‌ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్‌ తగ్గే అవకాశాలు ఉంటాయని చిత్ర బృందం ఆలోచిస్తుందట. ఇంతకుముందే టిక్కెట్ల పెంపు విషయంలో కూడా చిరంజీవి, సీఎం తో చర్చించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్ అతిధిగా వస్తున్నారన్న వార్తలు అటు సినీపరిశ్రమణలో, ఇటు రాజకీయాలలో చక్కర్లు కొడుతున్నాయి.