మహేష్ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..టికెట్ ధరల పెంచేందుకు గ్రీన్ సిగ్నల్

0
137

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. మహేష్‌ బాబు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. ఇటీవలే సర్కార్ వారి పాట ట్రైలర్, కళావతి సాంగ్  రిలీజ్ చేసి మహేష్ అభిమానులకు ఆనందపరిచింది. ఈ సినిమా మే 12న విడుదలై థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ పైన దృష్టి పెట్టారు. అయితే ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం చక్కని శుభవర్త చెప్పింది.

ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి చిత్రబృందాన్ని ఖుషి చేసింది. 10 రోజుల పాటు ప్రతీ టికెట్ కు రూ. 45 అదనంగా పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ పెరిగిన టికెట్ ధరలతో ఏపీలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేయబోతుందేమోనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.