‘RRR’ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..టికెట్ ధరల పెంపుపై జీవో జారీ

0
80

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొద్దిరోజులుగా టికెట్ ధరలపై ఉత్కంఠకు తెరదీస్తూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడున్న ధరలకు అదనంగా మరో రూ. 75 పెంచుకోవచ్చని జీవో జారీ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ప్రకారం రూ.100 కోట్లుకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకోవచ్చని జీవోలో ఉంది.