Appudo Ippudo Eppudo | ‘ప్రతి పది నిమిషాలకో ట్విస్ట్’.. లేటెస్ట్ సినిమాపై నిఖిల్

-

యంగ్ హీరో నిఖిల్(Nikhil) తాజాగా నటించిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo)’. ఈ సినిమాకు సుధీర్ వర్మ్(Sudhir Varma) దర్శకత్వం వహించాడు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే స్వామిరారా, కేశవ సినిమాలు వచ్చాయి. వీటిలో ఒకటి హిట్ అవగా మరొకటి పర్లేదన్న టాక్ తెచ్చుకుంది. దీంతో వీరి కాంబోలో వస్తున్న మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో వీరి కాంబో.. హిట్ కాంబో అన్న పేరు సంపాదించుకోవడం పక్కా అని మూవీ యూనిట్ చెప్తోంది. ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోను వేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిఖిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ప్రేక్షకులను ఈ మూవీ వేరే లోకానికి తీసుకెళ్లడం పక్కా అని చెప్పాడు. తన గాలికి చెప్తున్న మాటలు కాదని ధీమా వ్యక్తం చేశాడు.

- Advertisement -

Appudo Ippudo Eppudo | ‘‘స్వామిరారా సినిమాలో మిస్ అయిన ప్రేమికుడిని ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. కంటెంట్‌పై పూర్తి నమ్మకం ఉండే ఈ మాటలు చెప్తున్నా. ఈ సినిమా ఎప్పుడు చేశానా అని చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి ఈ మూవీ ‘కార్తికేయ 2’ తర్వాత తెరకెక్కించాలని అనుకున్నాం. ‘స్పై’ కన్నా ముందే రావాల్సింది ఈ సినిమా. నేను ప్రస్తుతం సినిమా మధ్య ఒక షెడ్యూల్ బ్రేక్ రావడంతో ఈ సినిమాను పూర్తి చేశాం’’ అని వివరించాడు. ఇదిలా ఉంటే నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో ఠాగూర్ మధు తొలి హీరోయిన్‌గా నటిస్తుండగా నభా నటేష్ రెండో హీరోయిన్‌గా కటిస్తోంది. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.

Read Also: భారీ రెమ్యునరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన తాప్సీ
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...