అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు ఎందుకు బాధపడటం అమ్మడు….

అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు ఎందుకు బాధపడటం అమ్మడు....

0
105

తెలుగు ఇండస్ట్రీలో అందంతోపాటు కాస్త తెలివి కూడా ఉండాలనేది పెద్దల మాట… వచ్చిన ప్రతీ ఆఫర్ ను ఒప్పుకుంటే దాని ప్రభావం కెరియర్ పై పడుతుందని చెప్పడానికి పంజాబ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ చక్కటి ఉదాహరణ… గతంలో ఈ అమ్మడి ఎక్కువగా గ్లామర్ గా కనింపించే పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చింది …

ఇప్పుడు ఆ గ్లామర్ తన కెరియర్ పై పడుతోంది… మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పంజాబ్ బ్యూటీ ఆ పేరు మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టలేదు…గతంలోకంటే రకుల్ కు అవకాశాలు తగ్గిపోయాయి… హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకున్నాయి… తాజాగ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ…

తాను వరుసగా గ్లామర్ పాత్రలకు చేస్తూ అందాలను ఆరబోయటమే పెద్దతప్పని చెప్పింది.. నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకోలేకపోయానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ… చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో అదేదో ముందే ఆలోచించి ఉంటే ఇలా అయ్యేది కాదుకదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు…