AR Rahman | గురువు బాటలోనే రెహ్మాన్ శిష్యురాలు.. ఏం చేసిందంటే..

-

ప్రముఖ సంగీత కళాకారుడు ఏఆర్ రెహ్మాన్(AR Rahman) దంపతులు ఇటీవల తమ దాంపత్య బంధానికి స్వస్తి పలికారు. దాదాపు 29 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకుంటున్నట్లు రెహ్మాన్ భార్య సైరా భాను(Saira Banu) తమ లాయర్ వందన ద్వారా ప్రకటించారు. ఒకరిపై మరొకరికి ప్రగాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లాయర్ వందన తెలిపారు. అయితే ఇప్పుడు రెహ్మాన్ శిష్యురాలు మోహిని డే కూడా ఇదే బాటలో పయనించారు. రెహ్మాన్ విడాకులు తీసుకున్న గంటల వ్యవధిలోనే మోహిని కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది.

- Advertisement -

రెహ్మాన్ దగ్గర బానిస్ట్‌గా పనిచేస్తున్న మోహిని(Bassist Mohini) కూడా మంగళవారం సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తానే స్వయంగా ప్రకటించింది. విడిపోయినా భర్తతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది మోహిని. కాగా గంటల వ్యవధిలోనే రెహ్మాన్(AR Rahman), అతడి సహాయకురాలు వేరువేరుగా విడాకులు తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు విడాకుల ఘటనలకు ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న చర్చల జోరుగా సాగుతోంది. 29ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత సైరా విడాకులు ఇవ్వాల్సినంత పరిస్థితి ఏం వచ్చిందన్న టాక్ కూడా గట్టిగానే కొనసాగుతోంది. మరి చూడాలి ఈ విడాకులు ఎటువంటి మలుపు తీసుకుంటాయో.

Read Also: చెర్రీపై విమర్శలకు ఉపాసన చెక్..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...