బతుకమ్మ పాటకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం

ar-rahman-music-for-batukamma-song

0
90

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ బతుకమ్మ పాటకు సంగీతం అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో ఈ పాట చిత్రీకరణ పూర్తి చేశారు. రచయిత మిట్టపల్లి సురేందర్‌ రాసిన పాటకు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని..ఉత్తర ఉన్నికృష్ణన్‌ స్వరాన్ని అందించారు.

చిత్రీకరణకు గౌతంమీనన్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 5న ఈ పాటను అధికారికంగా విడుదల చేయనున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.