విడాకుల విషయంపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్(AR Rahman) స్పందించాడు. ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘వైవాహిక జీవితంలో 30 ఏళ్ల గ్రాండ్ మార్క్‌ను చేరుకుంటామని ఆశించాం. కానీ అంతా కనిపించని ముగింపుగా మారింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. పగిలిన ముక్కలు మళ్ళీ అతుక్కోకున్నా ఈ విచ్ఛితిలో కడా అర్థాన్ని వెతుకుతున్నాం. ఈ బలహీన సమాయాన్ని అధిగమించేటప్పుడు తమ గోప్యతను గౌరవించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని రెహ్మాన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం రెహ్మాన్ దంపతులు విడాకులు వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
1995లో రెహమాన్(AR Rahman), సైరా బానూ(Saira Banu) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. ‘‘పెళ్ళయిన ఏళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వీరొచ్చారు. ఒకరిపై మరొకరికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కొన్ని అనూహ్య పరిస్థితులు వీళ్లిద్దరి మధ్య తీవ్ర అగాథాన్ని సృష్టించాయి. బాధను దిగమింగుకుని వారిద్దరూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కష్టకాలంలో వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజలు కూడా వారి స్థితిని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా. ఈ కష్టమైన దశను వారిద్దరూ దాటగలరని భావిస్తున్నా’’ అని లాయర్ వందన తన ప్రకటనలో పేర్కొన్నారు.