AR Rahman | వాళ్లందరికీ నోటీసులిచ్చిన ఏఆర్ రెహ్మాన్..

-

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్(AR Rahman) తాజాగాలు పలు వెబ్‌సైట్లు, యూట్యబర్లకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తన విడాకుల గురించి అత్యుత్సాహంతో ప్రచురించిన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆయన తన నోటీసుల్లో హెచ్చరించారు. అయితే ఏఆర్ రెహ్మాన్, ఆయన సతీమణి సైరా భాను(Saira Banu) ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సైరా తరపు న్యాయవాది వందన వెల్లడించారు.

- Advertisement -

ఏఆర్ రెహ్మాన్ కూడా ఇది నిజమేనని స్పష్టతనిచ్చారు. వీరు విడాకులు తీసుకున్న గంటల వ్యవధిలోనే రెహ్మాన్ బాసిస్ట్ మోహిని డే(Mohini Dey) కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. దీంతో అనేక రూమర్లు మొదలయ్యాయి. రెహ్మాన్-మోహిని డే రిలేషన్‌లో ఉన్నారని, అందువల్లే వీరిద్దరు తమతమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చేశారంటూ అనేక వార్తలు చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి. పలువురు యూట్యూబ్‌లో కూడా వీడియోలు చేసి పెట్టారు.

వీటిపై తాజాగా ఏఆర్ రెహ్మాన్(AR Rahman) స్పందించారు. తన గురించి సోషల్ మీడియా సహా ఎక్కడైనా జరిగిన అసత్య ప్రచారంపై పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే ప్రచురించిన కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించాలని లేని పక్షంలో అందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఆర్ రెహ్మాన్ లీగల్ టీమ్ హెచ్చరించింది. దీంతో అటువంటి వార్తలు రాసిన వారందరికీ డేంజర్ బెల్స్ మోగాయి. మరి ఈ అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read Also: ‘నాన్న బయోపిక్ చేయడం చాలా కష్టం’
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...