AR Rahman | మళ్ళీ కలిసిపోనున్న రెహ్మాన్, సైరా..?

-

ఏఆర్ రెహ్మాన్(AR Rahman), అతని సతీమణి సైరాభాను(Saira Banu) ఇటీవల విడిపోవాలని నిశ్చయించుకున్నారు. విడాకుల కోసం వీరిద్దరు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ విషయాన్ని వారి కేసు వాదిస్తున్న న్యాయవాది వందన వెల్లడించారు. అయితే తాజాగా వందన మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. రెహ్మాన్, సైరా మళ్ళీ కలిపోయే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చారు. వారి విడాకుల విషయం విని ఎంతో చింతించిన అభిమానులు ఇప్పుడు తాజాగా వందన ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుష్ అవుతున్నారు. వారిద్దరూ మళ్ళీ కలిసోవాలని కోరుకుంటున్నామని, అదే జరగాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వందన పలు విషయాలను తెలిపారు.

- Advertisement -

‘‘రెహ్మాన్(AR Rahman), సైరాలది సుదీర్ఘమైన వైవాహిక బంధం. ఎంతో ఆలోచించుకున్న తర్వాతే వారు ఈ నిర్ణయానికి వచ్చారు. విడిపోవడానికి సిద్ధపడ్డారు. పిల్లల కస్టడీ విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తల్లిదండ్రుల్లో ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే హక్కు పిల్లలకు ఉంది. అయినా ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేకపోలేదని నేను కొట్టిపారేయలేను’’ అని వందన షా వెల్లడించారు. దీంతో రెహ్మాన్, సైరా మళ్ళీ కలిసే అవకాశం ఉందని వందన చెప్పారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి వారి విడాకుల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Read Also: పెరుగు తింటే ఇన్ని లాభాలా..?
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....