డేటింగ్ లో విజయ్- రష్మిక..నేషనల్ క్రష్ ఏమన్నదంటే?

0
91

గీత గోవిందం సినిమాతో సూపర్ క్యూట్ జంటగా మారారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. అయితే ఈ సినిమాలో రష్మిక-విజయ్‌ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కాగా కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై విజయ్‌ కానీ, ఇటు రష్మిక కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఆగస్టు 25న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. ఇందులో భాగంగా ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌’ ప్రోగ్రాంలో ‘రష్మిక’పై విజయ్‌ దేవరకొండ అభిప్రాయం అడగ్గా ‘డార్లింగ్‌’ అంటూ సంభోదించాడు. అయితే ఈ వ్యవహారంపై బాలీవుడ్‌ మీడియా రష్మికను ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా స్పందించింది.

విజయ్‌ దేవరకొండతో మీరు డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఎందుకు స్పందించట్లేదు? అని అడిగిన ప్రశ్నకు ఆమె.. ‘నేనొక నటిని. సంవత్సరానికి అయిదారు సినిమాలు చేస్తున్నాను. మామూలుగా అయితే మీరు నా సినిమాల గురించి ప్రశ్నించొచ్చు. కానీ మీ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరు? ఎవరితో డేట్‌ చేస్తున్నారు? లాంటి ప్రశ్నలనే ఎక్కువగా అడుగుతున్నారు. నా వ్యక్తిగత జీవితంపై ఉన్న ఆసక్తి కారణంగా ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారని నాకు తెలుసు. కానీ నా నోటితో నేను చెప్పేంతవరకు అలాంటి ఎఫైర్‌ వార్తలను సీరియస్‌గా తీసుకోవద్దు. ఆ వార్తలతో ఎంజాయ్‌ చేసేవాళ్లను చేయనివ్వండి’ అంటూ సమాధానమిచ్చింది.