బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చిన సమయంలో, అందరి కుటుంబ సభ్యులు ఇంటిలోకి వచ్చారు.. ఈసమయంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న అరియానా కుటుంబం నుంచి ఆమె ఫ్రెండ్ వచ్చారు.. దీంతో ఆమె ఎంతో సంతోషించింది. అంతేకాదు అతని గురించి చాలా విషయాలు చెప్పింది, తను నాకు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పింది. దీంతో వారిద్దరూ లవ్ లో ఉన్నారు అని అందరూ భావించారు.
కాని దీనిపై క్లారిటీ ఇచ్చింది అరియానా…వినీత్ నాకు క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే. అమ్మ తర్వాత అమ్మలా. నాకో కేర్ టేకర్ లాంటోడు, అయితే ఇంట్లోకి కుటుంబ సభ్యులు వచ్చిన సమయంలో మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, అందుకే ఆ సమయంలో
వినీత్ పాప కోసం నేను వెళ్తా అని రిక్వెస్ట్ చేశాడట.అది జరిగింది అని అరియానా తెలిపింది.
ఇదే విషయం ఫినాలే రోజు నాగ్ సార్తో మా అమ్మే చెప్పింది. నా లైఫ్లో అతడి పాత్ర చాలా ఉంది. చిన్నప్పటి నుంచి మేము మంచి మిత్రులం అని తెలిపింది అరియానా. సో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అరియానా టాప్ 5 కి చేరిన విషయం తెలిసిందే.