టాలీవుడ్ కోలీవుడ్ లో యాక్షన్ కింగ్ అంటే ముందు వినిపించే పేరు నటుడు అర్జున్, ఆయన ప్రతినాయకుడి పాత్రలతో ఇప్పుడు అదరగొడుతున్నారు అనే చెప్పాలి, విభిన్న పాత్రలు అద్బుతమైన నటన ఆయన సొంతం. సౌత్ ఇండియాలో అనేక పాత్రలు చేశారు ఆయన పలు భాషల్లో.
ఓపక్క హీరోగా నటిస్తూ.. మరోపక్క ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కోలీవుడ్ లో కూడా ఆయనకు పలు అవకాశాలు అలాగే వస్తున్నాయి, ఇక తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు, తాజాగా ఆయన టాలీవుడ్ లో మరో కీలక రోల్ చేస్తున్నారట.
రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి పేరిట తాజాగా ఓ చిత్రం రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో అర్జున్ విలన్ గా చేస్తారు అని తెలుస్తోంది, ఇక షూటింగ్ లో కూడా ఆయన పాల్గొన్నారు అని వార్తలు వస్తున్నాయి, ఇక ఇందులో రవితేజకి జోడిగా అనూ ఇమ్మానుయేల్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్.