అర్జున్‌ కపూర్‌ వాచీ ఖరీదు ఎంతో తెలుసా!

అర్జున్‌ కపూర్‌ వాచీ ఖరీదు ఎంతో తెలుసా!

0
76

డాడీ వాచ్ కావాలీ అంటే ఓ 500 ఇస్తారు…అదే జాబ్ ఉంటే వెయ్యి రూపాయిలు పెట్టి కొనుక్కుంటాం. లేదా కొంచెం రిచ్ ఫ్యామిలీలో పుడితే ఓ 5వేలు పెట్టి కొనుక్కుంటాం. కానీ అర్జున్‌ కపూర్‌ మాత్రం ఏకంగా 27 లక్షల వాచ్ కొన్నాడు. ఇటీవల న్యూయార్క్‌ వెళ్లిన అర్జున్‌కపూర్‌ తన ఫోటోగ్రాఫ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఈ ఫోటోలో అర్జున్‌ లుక్‌ కంటే ఆయన చేతికి ఉన్న వాచీనే సోషల్‌ మీడియా ఫోకస్‌ చేసింది. అర్జున్‌ చేతికి ఉన్న రోలెక్స్‌ ట్రెండీ మోడల్‌ వాచ్‌ ధర రూ.27 లక్షలంట..ఈ వాచ్ ధరించి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్నాడు అర్జున్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అయ్యింది.

ఖరీదైన దుస్తులు, బ్యాగులతో ఆకట్టుకోవడం‍లో బాలీవుడ్‌ భామలే కాదు…మేము తీసిపోమని హీరోలు సైతం స్టైలిష్‌ లుక్‌ కోసం భారీ ఖర్చుకు వెనుకాడటం లేదు.