మీటూ ప్రకంపణలు సిని ఇండస్ట్రీని తార స్థాయిలో విమర్శలకు గుప్పిస్తున్నాయి. హాలీవుడ్ లో మొదలై బాలీవుడ్ లో తారస్థాయికి చేరుకుంటున్న ఈ ఉద్యమం ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారుతోంది. తాజాగా కన్నడ నటి సృతి హరిహరన్ కన్నడ తమిళ ద్విబాష చిత్రం నిమునన్ మూసీ సెట్స్ లో హీరో అర్జున్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
ఈ చిత్రంలో ఓ రొమాంటిక్ సిన్ లో భాగంగా అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి తనను టచ్ చేశారని సోషట్ మీడియాలో తెలిపింది సృతి హరిహరన్. చిన్నప్పటి నుంచి అర్జున్ సినిమాలను చూసి పెరిగిన తనకు అతడినుంచే చేదు అనుభవం ఎదురు అయిందని చెబుతోంది. దశాబ్దాలుగు ఇండస్ట్రీలో ఉండి సుమారు 150 సినిమాల్లో నటించి దాదాపు 60 మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న తనగురించి ప్రపంచానికి తెలుసని అన్నారు. ఏమీ లేకుండా సృతి ఇంటి ఆరోపణలు చేస్తుందో తనకు అర్థం కావడంలేదని అర్జున్ అన్నారు.