ఓటీటీలోకి ‘అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

0
93

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకొని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రొమాంటిక్ కామెడీ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మే6 న థియేటర్లలో  విడుద‌లై ప్రేక్షకులను ఖుషి చేసింది. అయిత్ ఈ సినిమాకు సంబంధించి  విశ్వ‌క్ జ‌రిపిన ప్రాంక్ వీడియో వైరల్ అయినా సంగతి అందరికి తెలిసిందే.

విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విశ్వ‌క్‌కు జోడీగా రుక్సార్ ధిల్లాన్‌, రితికా నాయ‌క్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. బీవిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌విసిసి బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం డిజిట‌ల్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

అయితే ఈ సినిమా తరువాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో అర్జున్ దర్శకత్వంలో సినిమాకు ఒకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ విశ్వక్ సేన్ కోసం ఒక మంచి వినూత్న పాత్రతో కథను సిద్ధం చేశాడని కథ విన్న విశ్వక్ కూడా నచ్చడంతో తప్పకుండా చేద్దామని చెప్పినట్లు సమాచారం కుడా తెలుస్తుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు వాస్తవమో?