బ్రేకింగ్: బిగ్ బాస్ ఫేం సరయూ అరెస్ట్

0
74

సెవెన్ హార్ట్ ఫేమ్ సరయు అరెస్ట్ అయింది. యూట్యూబర్ వీడియోల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది సరయు. ఆ తర్వాత ఏకంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది.  కాసేపటి క్రితమే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు సెలబ్రిటీ సరయును అరెస్టు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ వీడియోలో నటించిందని ఫిర్యాదు అందడంతో ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.