ఆరుగురు పతివ్రతలు సినిమా నటి అమృత – ఇప్పుడు ఏం చేస్తుందంటే

ఆ సినిమాలో అమృత పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చింది

0
96

కుటుంబ కథా చిత్రాలు చేయడంలో ఈవీవీ సత్యనారాయణ చాలా పేరు సంపాదించుకున్నారు. ఆయన తీసిన చిత్రాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇక టీవీల్లో ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే టీవీల ముందు అతుక్కుపోతారు జనం. ఆరుగురు పతివ్రతలు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆరుగురు మహిళలు తమ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. అందరి నటన సినిమాకి చాలా ప్లస్ అయింది.

ఈ సినిమా వచ్చిన తర్వాత కొందరు భర్తల్లో మార్పు వచ్చింది. భార్యని చాలా ప్రేమగా చూసుకున్న వారు ఉన్నారు. నీత, విద్య, అమృతలు ఇందులో నటించారు. ఈ సినిమాలో అమృత పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చింది.ఇద్దరు భర్తలున్న పాత్రలో నటించి పేరుపొందింది. ఈ సినిమా తరువాత మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలో కనిపించలేదు.

ఆమె కన్నడ పరిశ్రమకు చెందిన నటి. ఇక తెలుగులో అవకాశాలు రాకపోయినా కన్నడతో ఆమెకి అవకాశాలు వచ్చాయి. అమృత తెలుగు, తమిళ ఇండస్ట్రీలన్నీ కలిపి 10 వరకు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బెంగుళూరులో కుటుంబంతో ఉంటోంది అమృత.