‘అసలేం జరిగింది’ సినిమా రివ్యూ & రేటింగ్

-

నటీనటులు : శ్రీరామ్‌, సంచైత
నిర్మాతలు : మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ
బ్యానర్ : ఎక్స్‌డోస్ మీడియా బ్యాన‌ర్‌
సంగీతం : ఎలేంద‌ర్ మ‌హావీర్
దర్శకుడు : రాఘ‌వ
విడుదల తేదీ : 22 అక్టోబర్ 2021

- Advertisement -

గ్రామీణ తెలంగాణ‌లో జ‌రిగిన య‌ద్దార్థ ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ‘అసలేం జరిగింది’.. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో హీరో శ్రీరామ్, హీరోయిన్ సంచైత పడుకొనే నటించారు.ఈ చిత్రానికి ఎలేంద‌ర్ మ‌హావీర్ సంగీతం అందించారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్, పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అమిత‌మైన స్పంద‌న వ‌చ్చింది. చాలా కాలం తర్వాత హీరో శ్రీరామ్ మళ్లీ తెలుగులో డైరెక్ట్ మూవీ చేశారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో ఈ సమీక్ష చూసి తెలుసుకుందాం..

కథ :

హీరో ఉన్న గ్రామంలో ఏదో జరుగుతుందని పెద్ద పుకారు నడుస్తుంది. ఒక కారణం వల్ల వరుసగా ప్రజలు చనిపోతుంటారు. ప్రతీ అమావాస్య నాడు ఏదో తెలియని శక్తి గ్రామాన్ని ఆవరిస్తుందని, అందరూ నాశనం అవుతారని అతీత శక్తుల గురించి తెలిసిన ఓ వ్యక్తి గ్రామస్తులను హెచ్చరిస్తాడు. దీంతో గ్రామస్తులు అంతా ఊరు వదిలి వెళ్లేందుకు సిద్ధపడతారు. హీరో మాత్రం సమస్య మూలాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే అమావాస్య రోజున తాంత్రిక శక్తులతో ఉన్న విలన్ ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్ పై కన్నేస్తాడు. నిన్ను వదిలేది లేదని మెడలో చున్నీ వేసి లాక్కెళ్లడానికి యత్నిస్తాడు… ఆ తర్వాత ఏం జరిగింది.. హీరో హీరోయిన్, ఊరిని అతీత శక్తుల నుంచి రక్షిస్తాడా..? లేదా అన్నదే సినిమా కథ.

విశ్లేషణ:

నటీనటుల విషయానికి వస్తే.. శ్రీరామ్ నటన ప్రేక్షకులను బాగానే అలరించింది… సరికొత్త యాంగిల్ లో మనం శ్రీ రామ్ ను ఈ సినిమాలో చూడవచ్చు. హీరో ఆయన పాత్ర లో శ్రీరామ్ చాలా బాగా ఒదిగిపోయాడు. ఆయన లుక్ కూడా అదిరిపోయింది. నటనా పరంగా హీరోయిన్ పాత్ర కు సంచైత చక్కగా సరిపోయింది. గ్లామర్ పరంగా హీరోయిన్ పాత్ర కు ఆమె బాగానే ఉపయోగపడింది. ఇప్పటి తరం అమ్మాయి లా బాగా అలరించింది. అందరూ తమ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పవచ్చు. ఎమోషనల్, లవ్ సీన్స్ లో హీరో హీరోయిన్స్ మంచి నటన కనపరిచారు.

ఈ సినిమా మా కథ చాలా అద్భుతంగా ఉంది. నటీనటులను డైరెక్ట్ చేయడంలో దర్శకుడు రాఘవ నూటికి నూరు శాతం విజయాన్ని అందుకున్నాడు అని చెప్పాలి. దర్శకుడు ఒక సరికొత్త కథను రాసి ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ కలుగజేశాడు.. ఈ సినిమాలో డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ లోని డైలాగులు.. క్యారెక్టర్ల మధ్య సంభాషణలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను అబ్బురపరిచాయి.. సంగీతం చాలా బాగుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటర్ కష్టాన్ని ఈ సినిమా ఫలితం రూపంలో చూడవచ్చు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది.

ప్లస్ పాయింట్స్

కథ

నటీనటులు

డైరెక్షన్

స్టోరీ

మైనస్ పాయింట్స్

అక్కడక్కడ స్లో అవడం

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

మొత్తానికి ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య లవ్ స్టోరీ కామన్ పాయింట్ కాగా.. జాతకాలు, బ్లాక్ మ్యాజిక్ వంటి బ్యాగ్రౌండ్ నేపథ్యంలో తెరకిక్కిన సినిమా అబ్బుర పరిచే విధంగా ఉంటుంది. అనుకోకుండా మన జీవితంతో వచ్చే ఉపధ్రవాలను ఎలా ఎదుర్కొవాలి అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 3.5/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...