అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన డార్లింగ్ ప్రభాస్…

అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన డార్లింగ్ ప్రభాస్...

0
120

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు… ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రం చేస్తున్నాడు.. ఈచిత్రంలో ప్రభాస్ కు హీరోయిన్ గా పూజా హెగ్దె నటించిన సంగతి తెలిసిందే…

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ఇటలీలో పూర్తి చేసుకుంది.. ఇక తన తర్వాత సినిమా నాగ్ అశ్విన్ తో చేయనున్నాడు డార్లింగ్… ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా ఉంటుందని తెలిపారు… ఈచిత్రం తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం చేయనున్నాడు…

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.. కండలు తిరిగిన దేహంతో భారీగా కనిపించే ప్రభాస్ తాజా ఫోటో సన్నగా ఫిట్ గా కనిపించాడు… తాజా సమాచారం ప్రకారం రాధేశ్యామ్ షూట్ ను పూర్తి చేసుకున్న ప్రభాస్ తన తర్వాతి చిత్రాలకోసం లుక్ ను మార్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి…