‘నాటకం’ సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశిష్ గాంధీ.. రగ్డ్ లుక్ లో కనిపించి తొలి సినిమా తోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన తరువాతి చిత్రం మొదలైంది.. ‘నాటకం’ చిత్ర దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వం వహించడం విశేషం.. ‘నాటకం’ సినిమా తో తన ప్రతిభ ను చాటుకున్న కళ్యాణ్ జీ ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంశలు పొందాడు. కాగా ఈ చిత్రం లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు అశీష్ గాంధీ.
విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుమల రెడ్డి సహా నిర్మాతగా ఉండగా, మణికాంత్ కూర్పు ని అందిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో భారీ తారాగణంతో షూటింగ్ కి వెళ్లబోతుంది… మొత్తంగా ఈ సినిమా లో మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తుండగా తాజాగా పోలీస్ పాత్ర కు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది..
ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథకి హీరోగా అశిష్ గాంధీ మాత్రమే సూట్ అవుతాడనిపించింది. ఇటీవలే జరిపిన ఫోటోషూట్ లో మూడు డిఫరెంట్ పాత్రలకు అశీష్ గాంధీ చాల బాగా సూట్ అయ్యాడు. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమా అందరికి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ వెళ్ళబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు.
నటీనటులు
అశీష్ గాంధీ
సాంకేతిక విభాగం :
ఎడిటర్ : మణికాంత్
డీఓపీ : బాల్ రెడ్డి
కో ప్రొడ్యూసర్ : తిరుమల రెడ్డి
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ