టాలీవుడ్ లోనే కాదు దేశంలోనే చాలా వరకూ ఫాన్ ఫాలోయింగ్ ఉంది ప్రభాస్ కు, ఇక అంతర్జాతీయంగా మంచి ఫేమ్ సంపాదించాడు ప్రభాస్, ఇక బాహుబలి నుంచి ఎంతో పేరు వచ్చింది, ఇక పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు.
తాజాగా అక్కినేని సమంతా యాంకర్గా సామ్ జామ్ అంటూ షో ఆహా ఓటీటీలో వస్తోంది, ముఖ్యంగా టాప్ సెలబ్రెటీలని ఇందులో తీసుకువస్తున్నారు, వారి ఇంటర్వ్యూలతో మంచి హైప్ వస్తోంది, రౌడీ విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, నాగ్ అశ్విన్, మెగాస్టార్ చిరంజీవి ఇలా చాలా మంది ప్రముఖులు షోకు వస్తున్నారు, అయితే చాలా మంది అభిమానులు ఈ షోని లక్షల్లో చూస్తున్నారు.
అయితే తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా ఆహ్వానించారు అని తెలుస్తోంది, అయితే ఇప్పుడు కాదని కొంచెం షూటింగులతో బిజీగా ఉన్నాను తర్వాత చూద్దాం అని నేరుగా ప్రభాస్ చెప్పారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ప్రభాస్ ఇలా కనిపించడం షోకి హైలెట్ అవుతుంది కాని, ఆయన నెక్ట్స్ సినిమాల లుక్ పై ఫోకస్ పెట్టారు. ఇలా షో కి వస్తే ఆ లుక్ రివీల్ అవుతుందని ఈ షోకి రావడం లేదని తెలుస్తోంది.