అసురన్ సినిమాలో వెంకీకి హీరోయిన్ ఫిక్స్

అసురన్ సినిమాలో వెంకీకి హీరోయిన్ ఫిక్స్

0
95

వెంకీ మామ చిత్రం సక్సస్ అయింది… ఆ తర్వాత వెంటనే వెంకీ తమిళం లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్ అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.. సురేష్ బాబు రిజినల్ వర్షన్ నిర్మాత కళై పులి థానులు ఈ రీమేక్ ను నిర్మించబోతున్నారు.

వెంకటేష్ ఈ చిత్ర షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు, ఇక చిత్ర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది..
అసురన్ చిత్రంలో ధనుష్ కు జోడీగా మంజు వారియర్ నటించిన విషయం తెల్సిందే. ఆ పాత్రను తెలుగులో శ్రియతో పాటు పలువురు హీరోయిన్స్ చేస్తారు అని పేర్లు వినిపించాయి.

చివరకు తాజాగా ఈ సినిమాలోకి ప్రియమణిని ఫైనల్ చేశారు అని తెలుస్తోంది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె తాజాగా ఒక వెబ్ సిరీస్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. మళ్లీ ఈ చిత్రంలో ఆమె అవకాశం సంపాదించుకుంది.
ఈనెల 22న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదటి వారం రోజుల తర్వాత ప్రియమణి షూటింగ్ లో పాల్గొనబోతుందని అంటున్నారు. వేసవి తర్వాత ఈ చిత్రం విడుదల కానుంది.