కార్తీక దీపం ఈ సీరియల్ తెలుగు బుల్లితెరలో ఎంత ఫేమస్ సీరియలో తెలిసిందే.. దీనికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు… బుల్లితెరలో అన్నీ రికార్డులు దాటి టీఆర్పీ సొంతం చేసుకుంటుంది ఈ సీరియల్.. అయితే ఈ సీరియల్ కి వంటలక్క దీప పాత్ర డాక్టర్ బాబు పాత్ర తో మంచి హైప్ వచ్చింది.
ఇక డాక్టర్ బాబు తల్లిగా సౌందర్య రోల్ చేస్తోంది నటి అర్చన అనంత్… ఇక అత్త రోల్ లో ఆమె నటన అద్బుతం అంటున్నారు అందరూ, అయితే ఆమె కోడలిని కొడుకుని కలపాలి అని చేస్తున్న ప్రయత్నాలు కూడా అందరికి నచ్చుతున్నాయి.
అయితే ఈ రోల్ చేస్తున్న అర్చన అనంత్ నిజంగా ఈ పాత్రలో ఆమె 50 ఏళ్ల వయసు ఉన్న అత్తగా నటిస్తోంది… కాని నిజంగా ఆమె వయసు ఎంతో తెలుసా అర్చన వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. అంటే డాక్టర్ బాబు కంటే కూడా చిన్నదే. నిజంగా ఈ రోల్ చేయడం చాలా గొప్ప అంటున్నారు బుల్లి తెర సీరియల్ అనలిస్టులు… ఇంకా ఆమె పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు.