అవకాశాలు లేక కారు అమ్మేసిన నటుడు

అవకాశాలు లేక కారు అమ్మేసిన నటుడు

0
119

ఈ లాక్ డౌన్ వేళ చాలా మందికి ఆర్ధిక ఇబ్బందులు వస్తున్నాయి, చిన్న పని కూడా లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఇక చిత్ర పరిశ్రమలో కూడా ఇదే పరిస్దితి ఉంది. లాక్డౌన్ కారణంగా షూటింగ్లకు బ్రేక్ పడటంతో పూర్తిగా వారికి ఆదాయం దెబ్బతింది. ఈ క్రమంలో బాలీవుడ్ బుల్లితెర నటుడు మానస్ షా డబ్బుల కోసం తన కారును అమ్ముకున్నాడు.

ఈ విషయం తెలిసి చాలా మంది షాక్ అయ్యారు, తాను చివరిసారిగా నటించిన టీవీ షో హమరి బహు సిల్క్కు సంబంధించిన డబ్బు అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నటుడు ఆవేదనగా తెలిపారు.. ఈ సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని ఇది సవాల్ తో కూడుకున్న సమయం అని అన్నారు.

ఈ సమస్య నుంచి బయటపడటానికి నా కారు అమ్మేశాను అని తెలిపాడు. అంతేగాక నేను అద్దెకు ఉంటున్న ఇంటిని వదిలి లోఖండ్వాలాలో ఉన్న మా బంధువుల ఇంటికి మారాను అంటూ తన భాదను వెల్లడించారు. హమారీ దేవ్రాణి, సంకత్మోచన్ మహాబలి హనుమాన్ వంటి షోలలో ఆయన నటించారు…ఈ విషయం తెలిసి ఈ లాక్ డౌన్ చాలా మంది కుటుంబాలను ఆర్ధికంగా ఇబ్బందుల పాలు చేసింది అంటున్నారు ప్రజలు.