ఆయ‌న‌కు పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించిన మెగాస్టార్

ఆయ‌న‌కు పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించిన మెగాస్టార్

0
93

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు, అయితే కొర‌టాల కాన్సెప్ట్ తో ఇది తెర‌కెక్కుతోంది, ద‌ర్శ‌కుడు కొర‌టాల ఇందులో చ‌ర‌ణ్ తో కూడా ఓ పాత్ర చేయిస్తున్నారు, అయితే దీని త‌ర్వాత మెగాస్టార్ ఏ సినిమా చేస్తారు అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు.

అయితే టాలీవుడ్ టాక్ ప్ర‌కారం, ఆయ‌న లూసిఫర్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, దీనిని రీమేక్ చేయాలి అని దీని హ‌క్కుల‌ని చ‌ర‌ణ్ గ‌తంలో సొంతం చేసుకున్నారు,ఇక ఈ చిత్రం మ‌ళ‌యాళంలో ఎంత హిట్ అయిందో తెలిసిందే.

ఇక ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ముందు అంద‌రూ ద‌ర్శ‌కుడు వినాయక్ కు అప్ప‌గిస్తారు అని అనుకున్నారు, తర్వాత శ్రీకాంత్ అడ్డాల పేరు వినిపించింది, త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ పేరు వినిపించింది. కానీ ఈ రీమేక్ బాధ్యతలను సుజీత్ కి అప్పగించినట్టుగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. సాహో త‌ర్వాత ఈ వ‌ర్క్ పైనే బిజీగా ఉన్నాడ‌ట సుజీత్.