విడుదలకి నోచుకోని బ్యాడ్ బాయ్ బిలియనీర్ వెబ్ సిరీస్ .. కారణం అదేనా ?

విడుదలకి నోచుకోని బ్యాడ్ బాయ్ బిలియనీర్ వెబ్ సిరీస్ .. కారణం అదేనా ?

0
94

ఈ మధ్య కాలం లో ఓటీటీ లో వెబ్ సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగిపోయింది .థియేటర్ లు కూడా లేకపోవడం తో అందరు ఈ వెబ్ సిరీస్ ల పైన పడ్డారు .అయితే బ్యాడ్ బాయ్ బిలియనీర్ పేరుతో ఓ వెబ్ సిరీస్ ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావాల్సి ఉండగా , ఆ వెబ్ సిరీస్ ను విడుదలని నిలిపివేస్తూ సిటీ సివిల్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది .

అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు . సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యం రామలింగ రాజు ఇది అయన జీవిత కథే అంటూ , కాబట్టి దీని రిలీజ్ ను ఆపాలని కోర్టులో పిటీషన్ వేశారు .

అయితే ఆ పిటీషన్ ను లాయర్ నిరంజన్ రెడ్డి సిటీ సివిల్ కోర్ట్ దృష్టికి తీసుకు రాగ దీనిపై వాదనలు విన్న కోర్ట్ వెబ్ సిరీస్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .నిజంగా ఆ వెబ్ సిరీస్ లో ఎదో లొసుగు ఉండే ఉంటుందని కొందరు సినీ ప్రముఖులు అనుకుంటున్నారట .