పుష్ప ఫేమ్ ధనుంజయ్ బడవ రాస్కెల్ మూవీ రివ్యూ

-

నటీనటులు : ధనుంజయ్, అమృత అయ్యంగార్
సమర్పణ : శ్రీమతి గీత శివరాజ్ కుమార్
కో ప్రొడ్యూసర్ : ఖుషి
సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమణారెడ్డి , దేవన్ గౌడ
ఎడిటింగ్ : నిరంజన్ దేవర మని
ఫైట్స్ : వినోద్
మాటలు – సాహిత్యం : రామ్ వంశీకృష్ణ
కొరియోగ్రఫీ : తగరు రాజు
నిర్మాణ సారథ్యం : రిజ్వాన్
నిర్మాత : సావిత్రమ్మ, అడవి స్వామి
దర్శకుడు : శంకర్ గురు

- Advertisement -

భైరవ గీత, పుష్ప చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ధనుంజయ్ హీరోగా నటించిన చిత్రం బడవ రాస్కెల్. కన్నడలో సూపర్ హిట్ ఈ సినిమా డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్నారు.శ్రీమతి గీత శివరాజ్ కుమార్ సమర్పణ లో సావిత్రమ్మ,అడవి స్వామి నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా కి శంకర్ గురు దర్శకత్వం వహించగా క‌న్న‌డ‌లో విడుద‌లై విజ‌య‌ వంతంగా 50 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందో చూద్దాం.

కథ :

ఎంబీఏ చదివిన శంకర్‌ తండ్రిలాగే ఆటో డ్రైవర్‌గానే జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఓ పొలిటికల్ లీడర్‌ కుమార్తె సంగీత(అమృతా అయ్యర్‌)ని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో తను చేసే ఆటో పనిని మానేయమంటుంది. శంకర్ అందుకు ఒప్పుకోకుండా తన సొంత కాళ్లపై నిలబడి తానెంతో నిరూపించుకోవాలని అంటాడు. అప్పుడే సంగీత ఇంట్లో ఓ ఇష్యూ జరగడం తో వీరిద్దరూ విడిపోతారు. ఈ క్రమంలో శంకర్ కిడ్నాప్ అవుతాడు. అసలు ఈ కిడ్నాప్ చేసింది ఎవరు..ఉన్నత చదువును అభ్యసించిన శంకర్ ఎందుకు ఆటో డ్రైవర్‌గా మారాడు? ఆటో డ్రైవర్‌గా శంకర్ ఫిలాసఫి ఏమిటి? ఆటో డ్రైవర్‌ శంకర్‌తో గొప్పింటి యువతి సంగీత ఎందుకు ప్రేమలో పడింది. పీకల్లోతు ప్రేమలో కూరుకు పోయిన తర్వాత ఎందుకు వెనకడుగు వేసింది? అనేది సినిమాలో చూడాల్సిందే.

నటీనటులు :

పాత్రకు తగినట్టుగా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఫైట్స్, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. తల్లితో శంకర్ చెప్పే డైలాగ్స్, తండ్రితో పంచుకొనే భావోద్వేగం ఆకట్టుకొంటుంది. శంకర్ కు స్నేహితుడిగా నటించిన నాగభూషణ్ తన నటనతో అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు. శంకర్ ప్రియురాలిగా అమృత తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది. రంగాయణ రఘు, తార, స్పర్షరేఖ, పూర్ణచంద్ర మైసూరు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. సంగీత తల్లిగా స్పర్ష రేఖ నెగిటివ్ షేడ్స్‌ పాత్రతో ఆకట్టుకొన్నారు.

సాంకేతిక నిపుణులు :

కథ ఎలాంటిదైనా ఆకట్టుకునేలా, ఎంటర్‌టైన్‌ చేసేలా చెప్పడంలో దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. `బడవ రాస్కెల్‌` విషయంలో దర్శకుడు ఆ కొత్త ప్రయత్నం చేశారనిపిస్తుంది. శంకర్ గురు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కథ పరంగా రెగ్యూలర్‌ స్టోరీ అయినప్పటికీ అందరు ఆకట్టుకునేలా చేశాడు. తండ్రి కొడుకుల బంధం, తల్లీకొడుకు సెంటిమెంట్ ను బాగా చూపించాడు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రీతా జయరామన్ ప్రతిభను చాటుకొన్నారు. మాస్ సీన్లు, ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా తెరకెక్కించారు. వాసుకి వైభవ్ సంగీత బాగుంది. మాస్ నంబర్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. తెలుగులో రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా రిజ్వాన్‌ విడుదల చేశారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌కు తగినట్టుగా తెలుగులో రిచ్ క్వాలిటీస్‌తో బడవ రాస్కెల్‌ను రిలీజ్ చేశారు.

ప్లస్ పాయింట్స్ :

హీరో, హీరోయిన్స్

డైరెక్షన్

సంగీతం

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా ఊహించే సీన్స్

తీర్పు : లవ్, సెంటిమెంట్స్, యాక్షన్ మరియు కామెడీ వంటి అంశాలతో ఉన్న చక్కటి కుటుంబ కథా చిత్రం .

రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...