బాగా ఎమోషన్ అయిన ప్రిన్స్ మహేష్ బాబు

బాగా ఎమోషన్ అయిన ప్రిన్స్ మహేష్ బాబు

0
90

ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు.. చివరకు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మహేశ్ బాబు ఎమోషనల్ గా మాట్లాడారు.
ఇదొక మిరాకిల్ డే అని, తమ దర్శకుడు అనిల్ రావిపూడికి ఇవాళ అబ్బాయి పుట్టాడని, నిర్మాత దిల్ రాజు రెండోసారి తాత అయ్యాడని చెప్పారు. అయితే తమ సినిమా ఈవెంట్ రోజు ఇన్ని మంచి సంఘటనలు జరిగాయి అని తెలిపారు ఆయన

విజయశాంతి గారు తనను ఆకాశానికెత్తేశారని, ఆమెతో షూటింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో విజయశాంతి గారితో నటించానని, మళ్లీ ఇన్నాళ్లకు ఆమెతో నటించానని తెలిపారు. విజయశాంతిగారు ఎంతో కష్టపడి క్రమశిక్షణలో వచ్చారని అలాగే చిరంజీవి గారిలో కూడా అవే నేను చూశాను అని తెలిపారు మహేష్. తమ సినిమా ఒప్పుకోవడం ద్వారా ఆమె తమకు అవకాశం ఇచ్చారని మహేశ్ బాబు వినమ్రంగా తెలిపారు.

ఇక పిలిచిన వెంటనే వచ్చిన చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు… అలాగే రష్మిక చాలా స్వీటి అని తెలిపారు మహేష్.ఎనర్జీ ఉన్న దర్శకుడు అంటే అనిల్ రావిపూడి అని తెలిపారు ఆయన.ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇలాంటి అభిమానులు దక్కారని మహేష్ బాబు అభిమానుల గురించి అన్నారు.