బాహుబలి సీరీస్ లో మూడోభాగం కూడా రానుందని సమాచారం. ఈ విషయాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలిపాడు. దర్శకుడు రాజమౌళి బాహుబలి మూడో పార్ట్ ను కూడా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
కాగా ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయం మాత్రం తెలియదని ప్రభాస్ పేర్కొన్నాడు. బాహుబలి సీరీస్ లో వచ్చిన రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించాయి.