మరోసారి విశ్వరూపం చూపించిన బాలయ్య

మరోసారి విశ్వరూపం చూపించిన బాలయ్య

0
89

బాలయ్య బాబు సినిమా కెరియర్లో హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి.. ఆయన నటనకు నేటి తరం ఫిదా అయిన సినిమాలు అంటే బాలయ్య సింహ ,లెజెండ్ అనే చెప్పాలి, ఆ సినిమా డైలాగులు ఇప్పటికీ అందరి నోటి నుంచి వస్తాయి, తాజాగా మరోసారి బోయపాటి కాంబో మన ముందుకు రాబోతోంది,

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.3గా మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బోయపాటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అందరూ ఎదురుచూశారు. మొత్తానికి సినిమాని పట్టాలెక్కించారు బాలయ్య.

ఫస్ట్ షాట్లోనే నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం అనే పవర్ఫుల్ డైలాగ్ను తనదైన స్టైల్లో చెప్పారు నటసింహం నందమూరి బాలకృష్ణ. మొత్తానికి తొలి షాట్ అదిరింది. అలాగే ఆయన డైలాగ్ లు ఈ సినిమాలో మరిన్ని ఉంటాయి అంటున్నారు, ఈ సినిమా బాలయ్య బాబు గత రికార్డులని తిరగరాస్తుంది అంటున్నారు అభిమానులు. తమన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు.