బాలకృష్ణ అఖండ చిత్రం రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?

బాలకృష్ణ అఖండ చిత్రం రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?

0
92

బోయపాటి – బాలకృష్ణ కాంబోలో వస్తోంది అఖండ చిత్రం…. వీరి కాంబోలో మూడో చిత్రంగా ఇది వస్తోంది… అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.. అభిమానులు దీని కోసం ఎదురుచూస్తున్నారు, అయితే బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో అఖండ రూపొందుతోంది.ఈ సినిమాలో బాలకృష్ణ రైతు గా, అఘోరగాను కనిపించనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

ఇప్పటికే వచ్చిన ఈ సినిమా టీజర్, రికార్డుస్థాయిలో వ్యూస్ ను రాబట్టుకుంది…ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు అఖండ చిత్రాన్ని… భారీగా ఏర్పాట్లు చేశారు, మంచి మార్కెట్ అవుతోంది, అయితే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ తో పరిస్దితులు మారిపోయాయి. థియేటర్లు క్లోజ్ అయ్యాయి.

 

షూటింగుకు కూడా ఈ కరోనా కేసులు వల్ల బ్రేక్ వచ్చింది. ఇంకా 10 రోజుల షూటింగ్ వర్క్ ఉంది అని తెలుస్తోంది.. అయితే అనుకున్న సమయానికి సినిమా వచ్చే అవకాశాలు లేవు అంటున్నారు….దాదాపు ఈ చిత్రం సెప్టెంబర్ లో వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో… అయితే చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. అభిమానులు మాత్రం దీని గురించి వెయిటింగ్.